బ్రేకింగ్.. ఆస్తుల కేసులో కోర్టుకు హాజరు కాని జగన్

బ్రేకింగ్.. ఆస్తుల కేసులో కోర్టుకు హాజరు కాని జగన్

ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ శుక్రవారం కోర్టుకు హాజరుకాలేదు. మొదట హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఏపీలో హాజరుకావాల్సిన అధికార కార్యక్రమాలను సీఎం జగన్‌ వాయిదా వేసుకున్నారు. మరోవైపు జగన్‌ వస్తున్నారనే సమాచారంతో కోర్టు దగ్గర భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే సీబీఐ కోర్టు జడ్జి సెలవులో ఉండడంతో.. జగన్‌ కోర్టుకు హాజరు కాలేదు. ఇప్పటి వరకు సీఎం హోదాలో జగన్‌ కేవలం ఒక్కసారి మాత్రమే కోర్టుకు హాజరయ్యారు.

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కుదరదని సీబీఐ కోర్టు స్పష్టం చేయడంతో.. నేరుగా హైకోర్టును జగన్‌ ఆశ్రయించారు. ప్రస్తుతం జగన్‌ వేసిన ఆబ్సెంట్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ దశలోనే ఉంది. ఈ నేపథ్యంలో కోర్టుకు హాజరకాకుండా ప్రతిసారి ఆబ్సెంట్‌ పిటిషన్‌ వేస్తూ వస్తున్నారు. అయితే ఈడీ కేసులో తప్పకుండా విచారణకు హాజరుకావాల్సి ఉండడంతో.. జగన్‌ కోర్టుకు శుక్రవారం వద్దమనుకున్నారు. కానీ జడ్జి లీవ్‌లో ఉండడంతో జగన్‌ కోర్టుకు హాజరు కాలేదు.

Tags

Next Story