రాజధానిని కాపాడుకునేందుకు అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రజలు
ఏపీలో సేవ్ అమరావతి నినాదం మారుమోగుతోంది. రాజధానిని కాపాడుకునేందుకు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు ప్రజలు. ఉద్యమం 51రోజులకు చేరినా ప్రభుత్వం మనసు మారడం లేదు. దీంతో వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు రైతులు.. తాళ్లాయపాలెంలో మహిళలు జలదీక్ష చేపట్టారు. మొదట కృష్ణానదికి పూజలు నిర్వహించారు. తరువాత చీర పెట్టి పూజలు నిర్వహించారు. ఆ వెంటనే కృష్ణా నదిలో జలదీక్ష చేపట్టారు..
టెంట్లు తీసేస్తే రోడ్ల మీద.. అక్కడా అడ్డుకుంటే సొంత స్థలాల్లోనూ అన్నట్టుగా ఉద్యమాన్ని ఏ దశలోనూ తగ్గకుండా ముందుకు తీసుకెళ్తున్నారు 29 గ్రామాల రైతులు. తుళ్లూరులో రైతులు టెంట్లు తీసేసి తాటాకు పందిళ్లు వేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో శాశ్వతంగా ఉండేలా..పందిళ్లు వేశారు. ఎన్నాళ్లైనా దీక్షలు ఆపేది లేదని కూడా స్పష్టం చేస్తున్నారు.
రాయపూడిలో దీక్షాశిబిరాన్ని సందర్శించిన మాజీ మంత్రి దేవినేని ఉమ.. రైతులకు సంఘీభావం ప్రకటించారు..ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ సర్కారుకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారని అన్నారు.
రాజధాని కోసం అమరావతి మహిళలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం మనసు మారడం లేదు. కనీసం రాజధాని రైతుల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో జగన్ ప్రభుత్వ తీరుపై మహిళలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు..
అమరావతికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.JAC ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కదిరిలోని లక్ష్మీనర్సింహస్వామిని.. దర్శించుకున్న నాయకులు..జగన్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారుకున్నారు..
గంటూరులో అంబేద్కర్ విగ్రహం ఎదుట TNSF ఆందోళన చేపట్టింది. చెప్పులు కుడుతూ వినూత్నంగా నిరసన చేపట్టారు. 5 కోట్ల ప్రజలతో జగన్ ప్రభుత్వం చెలగాటమాడుతోందంటూ మండిపడ్డారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com