కర్నూలులో దారుణం.. 6ఏళ్ల బాలికపై అత్యాచారం

కర్నూలులో దారుణం.. 6ఏళ్ల బాలికపై అత్యాచారం

కర్నూలు నగరంలోని బండిమెట్టలో దారుణం జరిగింది. 6ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు ఖాజామోదిన్‌ అనే కిరాతకుడు. స్కూల్‌ బయట ఆడుకుంటున్న బాలికను సైకిల్‌పై తీసుకెళ్లి.. అత్యాచారం చేశాడు. బాలికకు తీవ్రగాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు తమ అదుపులో తీసుకున్నారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు బాలిక బంధువుల ఆందోళనకు దిగారు.

Tags

Read MoreRead Less
Next Story