మేడారంలో ‘జై అమరావతి’ నినాదాలు

మేడారంలో ‘జై అమరావతి’ నినాదాలు

మేడారంలో జై అమరావతి నినాదాలు మార్మోగాయి. రాజధాని ప్రాంతాల నుంచి రైతులు, మహిళలు మేడారం జాతరకు తరలివచ్చారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సమ్మక్క, సారలమ్మను వేడుకున్నారు. సీఎం జగన్‌ మనసు మార్చాలని వనదేవతలకు బంగారం సమర్పించి మొక్కుకున్నారు. జోలె పట్టి వేడుకున్నారు.

తమ గోడు వెళ్లబోసుకుంటూ వనదేవతల ఎదుట మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. 3 రాజధానులు వద్దు, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రార్థించారు. ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. వనదేవతలు తమకు న్యాయం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

అమరావతి కోసం 53 రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోడవంతో దేవుడిపైనే భారం వేస్తున్నారు. ఇప్పటికే బెజవాడ కనకదుర్గతోపాటు ఏపీలోని ప్రముఖ ఆలాయల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.. ఇప్పుడు ప్రత్యేక బస్సుల్లో అమరావతి నుంచి మేడారం వచ్చిన రైతులు, మహిళలు వనదేవతలను వేడుకున్నారు. ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోవడంతో ఎమ్మెల్యే సీతక్క ఆమెను ఓదార్చారు.

Tags

Read MoreRead Less
Next Story