జై అమరావతి నినాదాలతో మార్మోగిన బెజవాడ

జై అమరావతి నినాదాలతో మార్మోగిన బెజవాడ

జై అమరావతి నినాదాలతో మార్మోగింది బెజవాడ. రాజధానికి మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ డిమాండ్ చేశారు. కుమ్మరిపాలెం సెంటర్ నుంచి సితార సెంటర్ వరకూ జరిగిన ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా లోకం కదంతొక్కింది..

ర్యాలీలో వంగవీటి రాధాకృష్ణ, గద్దె అనురాధ, వివిధ పార్టీల నేతలు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు..సీఎం జగన్ తీరుపై వంగవీటి మండిపడ్డారు. 52 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా.. సీఎంకు కనపడటం లేదా అని ప్రశ్నించారు.

Tags

Next Story