అమరావతిలో భూముల క్రయవిక్రయాలపై విచారణ జరపాలి: ఐటీశాఖకు సీఐడీ లేఖ
BY TV5 Telugu8 Feb 2020 3:07 PM GMT

X
TV5 Telugu8 Feb 2020 3:07 PM GMT
అమరావతిలో భూముల కొనుగోళ్లపై ఐటీశాఖకు సీఐడీ లేఖ రాసింది. 2018 నుంచి 2019 వరకు జరిగిన క్రయవిక్రయాలపై విచారణ చేపట్టాలంటూ.. ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ పి.వి. సునీల్ కుమార్.. ఐటీ చీఫ్ కమిషనర్‌కు లేఖ రాశారు. 2లక్షల రూపాయలకు మించి జరిగిన అనుమానిత లావాదేవీలపై విచారణ జరపాలని కోరారు. ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ.. జరిగిన భూముల అమ్మకాలు, కొనుగోళ్లుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన 106 మంది వివరాలను కూడా లేఖతోపాటు ఐటీ అధికారులకు పంపారు సునీల్ కుమార్.. భూముల అడ్రెస్‌తోపాటు, సర్వే నెంబర్లను కూడా ఐటీ కమిషనర్‌కు అందజేశారు.
Next Story