మందకొడిగా సాగుతోన్నపోలింగ్

మందకొడిగా సాగుతోన్నపోలింగ్

ఢిల్లీలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 2గంటల వరకూ కూడా కేవలం 28 శాతమే నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. సరిగ్గా ఒంటిగంటకు 26.36 శాతం, మధ్యాహ్నం 1 లోపు అయితే 19.37 శాతం , 12 గంటల సమయానికి 15.57 శాతం నమోదయిందని ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే 2 గంటల తరువాత మాత్రం కాస్త ఊపందుకుంది. ఓటర్లు ఇళ్లలోనుంచి రావడం మొదలు పెట్టారు. అయితే ఈసారి గతంకంటే ఎక్కువగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి. కానీ ప్రస్తుత పోలింగ్ సరళి చూస్తోంటే అనుకున్న స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కావడం లేదు. మరోవైపు పోలింగ్ సరళి ప్రశాంతంగా సాగుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా 40,000 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. అలాగే 19,000 మంది హోమ్ గార్డులు, 190 పారామిలిటరీ దళాలను ఢిల్లీ అంతటా ఉంచారు.

Tags

Read MoreRead Less
Next Story