ఆంధ్రప్రదేశ్‌లో దిశ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో దిశ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో తొలి దిశ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభమైంది. రాజమహేంద్రవరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దిశ పీఎస్‌కు రిబ్బన్ కట్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. ప్రతి జిల్లాలో దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. మొత్తం 18 పీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టంచేసింది.

మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపుల కేసుల్లో IPC 354F, 354G సెక్షన్లను అదనంగా చేర్చారు. దిశ చట్టం కింద కేసు నమోదైతే వారంలో దర్యాప్తు జరపాల్సి ఉంటుంది. 14 పని రోజుల్లో విచారణ పూర్తిచేయాలి. డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షించాలి. ప్రతి జిల్లాలోను ప్రత్యేకంగా దిశ కోర్టులు ఏర్పాటు చేస్తారు. మంగళగిరి, విశాఖపట్నం, తిరుపతిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లను ఆధునీకరించనున్నారు. దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది.

Tags

Read MoreRead Less
Next Story