పీఎస్‌ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం

పీఎస్‌ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా ఆలూరులో పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయం ముందు ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. తాను ప్రేమించిన వ్యక్తిని పోలీసులు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రాజీ పేరుతో పోలీస్‌ స్టేషన్‌లో పంచాయితీ పెట్టారని ఆరోపించింది. తీవ్ర ఆవేదనతో ముందుగా తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును పోలీసుల ఎదుటనే తాగింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతిని ఆలూరు ఆస్పత్రికి తరలించారు.

Tags

Next Story