ఆ సామాజిక వర్గం ఉన్నతాధికారులను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందా?
ఒక సామాజిక వర్గం ఉన్నతాధికారులను టార్గెట్ చేసిన జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వేధింపులకు గురి చేస్తున్నట్టు కనిపిస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మొన్న జాస్తి కృష్ణ కిషోర్.. ఇప్పుడుఏబీ వెంకటేశ్వర్రావు.. ఈ తరహాలోనే మరికొందరిని ఇబ్బంది పెడుతున్నారని అధికారవర్గాలే చెప్తున్నాయి. నచ్చనివారిని VRకు పంపిస్తున్న ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా నెలల తరబడి ఉంచేస్తోందని అంటున్నారు. తాజాగా VRలో 3 నెలలు ఉంటే జీతం ఇవ్వకూడదని కూడా జీవో జారీ చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పలువురు ఉన్నతాధికారులకు ప్రభుత్వ నిర్ణయంతో ఇబ్బందులు తప్పడం లేదు. వేకెన్సీ రిజర్వ్‌లో ఉండే ఆ కాలాన్ని అసాధారణ సెలవుగా పరిగణించి వేతనం ఇవ్వకూడదని నిర్ణయం తీసుకోవడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఏదైనా విషయంలో విధుల్లో ఉన్న అధికారి చర్యలు వివాదాస్పదమైనా, తప్పులు జరిగినట్టు ఆరోపణలు వచ్చినా VRకి పంపిస్తారు. కొద్ది రోజుల తర్వాత మరెక్కడైనా పోస్టింగ్ ఇస్తారు. కానీ YCP సర్కార్ వచ్చాక VRలో ఉన్న చాలా మందికి పోస్టింగ్ ఇవ్వలేదు. దాదాపు 58 డీఎస్పీలు, 100 మంది ఇన్‌స్పెక్టర్లు, 10 మంది అదనపు ఎస్పీలు 8 నెలలుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరందరికీ తాజా ఉత్తర్వులతో జీతం అందుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, రేపయినా జీతం వస్తుందని ఆశిస్తుంటే మొదటికే మోసం వచ్చేలా నిర్ణయయాలు తీసుకోవడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. IRS అధికారి జాస్తి కృష్ణకిషోర్, IPS అధికారి ఏబీ వెంకటేశ్వర్రావు ఇప్పటికే సర్కారు వేధింపులతో ఇబ్బంది పడుతుందే ఇకపై తమ వంతు వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com