శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల బీభత్సం

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల బీభత్సం

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగుల సంచారంతో ఆంధ్రా, ఒడిషా సరిహద్దు గ్రామాలు వణికిపోతున్నాయి. జిల్లాలోని మెలియాపుట్టి మండలంలో పెద్ద ఎత్తున ఏనుగుల గుంపు సంచరిస్తోంది. స్థానిక పంటల మీద పడి ధ్వంసం చేస్తున్నాయి. రాత్రి వేళల్లో మైదాన ప్రాంతానికి వచ్చి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో స్థానిక గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఆరు గాలం శ్రమించి పండించిన పంటలను ఏనుగులు నాశనం చేస్తుండడంతో.. రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story