మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

చనిపోయిన ఐటీ ఉద్యోగుల పేర్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను.. సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. HDFC బ్యాంక్‌ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపినట్టు సీపీ సజ్జనార్‌ తెలిపారు. డూబ్లికేట్‌ సిమ్ కార్డ్స్‌తో క్రెడిట్‌ కార్డ్స్‌ తీసుకుని... ఐటీ ఉద్యోగుల్లా మోసానికి పాల్పడ్డట్టు సీపీ చెప్పారు. ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. కోటాక్‌ మహీంద్ర, బజాజ్ ఫైనాన్స్‌లో 2 లక్షలు వసూళ్లకు పాల్పడ్డట్టు విచారణలో తేలింది. మొత్తం 53 లక్షల 95 వేల చీటింగ్‌ చేసినట్టు.. సజ్జనార్‌ తెలిపారు. 2010 నుంచి ఈ గ్యాంగ్‌ మోసాలకు పాల్పడ్డట్టు గుర్తించామన్నారు సజ్జనార్‌.

Tags

Read MoreRead Less
Next Story