ఏపీలో‌ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

ఏపీలో‌ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు లభించాయి. 2002 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు సీహెచ్ శ్రీకాంత్, ఎ.ఎస్.ఖాన్, జె.ప్రభాకర్ రావు, డి.నాగేంద్రకుమార్ లకు ఐజీ ర్యాంకు హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు ఆర్.జయలక్ష్మి, జీవీజీ అశోక్ కుమార్, జి.విజయకుమార్, కె. రఘురామ్, అకె రవికృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్.హరికృష్ణ, కెవీ.మోహన్‌ రావు, పీహెచ్‌డీ రామకృష్ణ, ఎం.రవిప్రకాశ్, ఎస్.వి.రాజశేఖర బాబు లకు డీఐజీలుగా పదోన్నతులు కల్పించింది. 1995 బ్యాచ్ అధికారులు అతుల్ సింగ్, ఆర్కే మీనాలకు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story