3 రాజధానుల ప్రతిపాదనకు కాంగ్రెస్ వ్యతిరేకం : శైలజానాథ్
BY TV5 Telugu10 Feb 2020 10:56 AM GMT

X
TV5 Telugu10 Feb 2020 10:56 AM GMT
విధ్వంసకర ఆలోచనలతో జగన్ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ శైలజానాథ్. 3 రాజధానుల ప్రతిపాదనకు కాంగ్రెస్ వ్యతిరేకమని స్పష్టం చేశారు. జగన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా..అఖిలపక్షాన్ని పిలిచి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. 54 రోజులుగా రాజధాని ప్రజలు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సీఎం, మంత్రులు ఓపెన్‌టాప్ జీపులో వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లగలరా అని శైలజానాథ్ ప్రశ్నించారు.
Next Story