జోక్విన్ ఫీనిక్స్ కు ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డు

జోకర్ సినిమాలో విలక్షణ నటనతో అదరగొట్టిన జోక్విన్ ఫీనిక్స్ ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో దక్షిణ కొరియా చిత్రం పారాసైట్ సత్తా చాటింది. అవార్డుల పంట పండించుకుంది. మొత్తం నాలుగు కేటగిరీల్లో నాలుగు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లేతో పాటు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ పిల్మ్ విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ముందు నుండి ఎన్నో అంచనాలని పెంచుకున్న పారాసైట్ చిత్రం ఆస్కార్ కిరీటం దక్కించుకుంది.
లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 92వ ఆస్కార్ అవార్డ్ వేడుకలో పారాసైట్ చిత్రంతో పాటు జోకర్, 1917 చిత్రాలు కూడా తమ హవాను చూపాయి. జోకర్ చిత్రానికి గాను హీరో జోక్విన్ ఫినిక్స్ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఉత్తమ నటుడుతో పాటు జోకర్ సినిమాకు చక్కటి సంగీతం అందించిన హిల్దార్ ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్నాడు. 1917 సినిమా మూడు విభాగాల్లో, సౌండ్ మిక్సింగ్, సినిమాటోగ్రఫీ అవార్డులను ఎగరేసుకుపోయింది. ఉత్తమ్ నటిగా జూడి సినిమాకు గాను రెంజి జెల్వెగర్ అవార్డును సొంతం చేసుకుంది..
వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రంలో బ్రాడ్ పిట్ నటననకు ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్‌గా టాయ్‌స్టోరీ నిలిచింది. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌గా టాయ్‌స్టోరీ-4, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే బాంగ్ జాన్ హో (పారాసైట్), బెస్ట్ లైవ్‌యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌గా ద నైబర్స్ విండో నిలువగా, ఉత్తమ స్క్రీన్‌ప్లే తైకా వెయిటిటి జోజో రాబిట్ కు దక్కింది. ఈ వేడకకు ప్రముఖ హాలీవుడ్ తారాగణమంతా హాజరై సందడి చేసింది.
RELATED STORIES
Kapil Sibal: కాంగ్రెస్‌కి రాజీనామా చేసిన సీనియర్ నేత.. రాజ్యసభ సీటు...
25 May 2022 12:00 PM GMTOdisha: మొబైల్ ఫోన్ దొంగిలించాడని లారీకి కట్టి, చెప్పుల దండ వేసి..
25 May 2022 9:30 AM GMTపశువుల కాపరి.. పట్టుదలతో ఆర్మీ ఆఫీసర్..
25 May 2022 6:28 AM GMTVismaya-Case: నా కూతురి ఆత్మ కారులోనే ఉంది.. అతడికి యావజ్జీవ శిక్ష...
24 May 2022 1:15 PM GMTTamil Nadu: బిర్యానీ లేదు.. అందుకే పెళ్లి వాయిదా..!
24 May 2022 12:40 PM GMTKarnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ప్రైవేట్ బస్సు ఢీ.. 9...
24 May 2022 8:50 AM GMT