ఫ్యాన్సీ నెంబర్‌ కోసం తెలంగాణ రవాణాశాఖ కొత్త విధానం

ఫ్యాన్సీ నెంబర్‌ కోసం తెలంగాణ రవాణాశాఖ కొత్త విధానం

ఫ్యాన్సీ నెంబర్.. వాహనదారులకు ఇదో క్రేజీ ఫీలింగ్‌. కారణం ఏదైనా ఫ్యాన్సీ నెంబర్‌ కోసం వాహనదారులు తెగ ఆరాడపడతారు. సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్‌ తీసుకోవాలని కోరుకుంటుంటారు. ఐతే నెంబర్ల కేటాయింపులో తెలంగాణ రవాణాశాఖ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఇకనుంచి తమకు ఇష్టమైన ఫ్యాన్సీ నెంబర్‌ను దక్కించుకునేందుకు ప్రత్యేకంగా ఈ- బిడ్డింగ్‌ను అమలు చేస్తోంది. పైలెట్‌ ప్రాజెక్టు కింద హైదరాబాద్‌లో నాలుగు ఆర్టీఐ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేయబోతోంది. ఖైరతాబాద్‌, సికింద్రాబాద్, మలక్‌పేట్, బండ్లగూడా రవాణాశాఖ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ- బిడ్డింగ్‌ విధానాలు తీసుకొచ్చారు..

టూ వీలర్స్, ఫోర్స్‌ వీలర్స్‌ వెహికిల్‌లకు ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఈ- బిడ్డింగ్‌ నిర్వహించనున్నారు ఆర్టీఏ అధికారులు. కాగా నెంబర్‌ రిజర్వేషన్‌ చేసుకోవాలనుకునే వాహనదారులు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ అందించాల్సి ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటల వరకు.. బిడ్‌కు సంబంధించి నగదు చెల్లింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఆ నెంబర్‌ కేటాయించినట్టుగా రవాణాశాఖ నుంచి సదరు వ్యక్తులకు మేసేజ్‌ వెళ్తుంది. ఇందులో ఏదైనా సమస్య ఉంటే.. హెల్ప్ లైన్‌ నెంబర్లను కూడా రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేశారు.

ఈ- బిడ్డింగ్‌ ద్వారా ఫ్యాన్సీ నెంబర్‌ తీసుకోవాలనుకునే వాహనాదారుడికి సేవలు మరింత చేరువకానున్నాయి. బిడ్డింగ్‌ పద్ధతితో తమకు కావాల్సిన నెంబర్‌ను దక్కించుకోవచ్చు. ఉదాహరణకు 9, 999, 9999 సంఖ్యలలో నెంబర్లు కావాలనుకునే వారు 50వేటు చెల్లించాల్సి ఉంటుంది. ఇక 333, 555, 666, 777 ఇలా నెంబర్ల కోసం 30వేలు చెల్లించాలి. అయితే నిర్ధిష్ట రిజిస్ట్రేషన్‌ నెంబర్ కోసం రోజులో ఒకటి కంటే ఎక్కువ ధరఖాస్తులు వస్తే.. ఆర్‌ఆర్‌ఎమ్‌టీఎస్‌తో పాటు..క్లోజ్డ్‌ ఎన్వలప్‌లలో టెండర్లు స్వీకరించడం ద్వారా నెంబర్లను రిజర్వు చేస్తారని తెలుస్తోంది. దీనిద్వారా ఆర్టీఏకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరనుంది.

Tags

Read MoreRead Less
Next Story