బిల్లులు సెలెక్ట్‌ కమిటీకి వెళితే భయం ఎందుకు: యనమల రామకృష్ణుడు

బిల్లులు సెలెక్ట్‌ కమిటీకి వెళితే భయం ఎందుకు: యనమల రామకృష్ణుడు

ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా సభకు బిల్లులు తెచ్చారని.. టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. బిల్లులు సెలెక్ట్‌ కమిటీకి వెళితే భయం ఎందుకని ప్రశ్నించారు. మూడు, నాలుగు నెలల్లో సెలెక్ట్‌ కమిటీ నివేదిక ఇస్తుందన్నారు యనమల. బిల్స్‌ను తాము అడ్డుకోలేదని, సవరణలు మాత్రమే సూచించామన్నారు. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు ఓటింగ్‌ జరగాలనేది పసలేని వాదన అన్నారు యనమల. కౌన్సిల్‌ సెక్రటరీపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెస్తోందన్నారు యనమల రామకృష్ణుడు.

వైసీపీ ప్రభుత్వం అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారులపై వేధింపులకు పాల్పడితే ఎలా అని యనమల ప్రశ్నించారు. బాగా పనిచేసేవారిపై కూడా.. వేధించడం తగదని అన్నారు. ఇప్పటికైనా అధికారులను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలని సూచించారు.

Tags

Next Story