సీఎం వెళ్లే దారిలో రైతుల దీక్షా శిబిరం వద్దని పోలీసుల ఒత్తిడి

సీఎం వెళ్లే దారిలో రైతుల దీక్షా శిబిరం వద్దని పోలీసుల ఒత్తిడి

మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ సచివాలయానికి వస్తున్నారు. దీంతో.. సీఎం వెళ్లే దారిలో దీక్షా శిబిరం వద్దని రైతులపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు. మందడంలో రైతుల శిబిరం మార్చాలంటూ పట్టుబడుతున్నారు. సోమవారం ప్రైవేట్ స్థలంలో టెంట్‌ వేసుకున్న రైతులు అక్కడే నిరసన తెలుపుతున్నారు. ఐతే.. అది సీఎం వెళ్లే దారి కాబట్టి రైతులు అక్కడికి రావొద్దని పోలీసులు కోరుతున్నారు. సీఎం సెక్రటేరియెట్‌కు బయలుదేరేలోపు రైతులు అటు రాకుండా చూసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

రాజధాని అమరావతిలో 56వ రోజు రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు, వెలగపూడిలో రిలే దీక్షలు చేస్తున్నారు. మంగళవారం కూడా రైతుల 24 గంటల దీక్షలు చేయనున్నారు. ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా తమ ఉద్యమం ఆగబోదని రైతులు స్పష్టం చేస్తున్నారు. చట్టపరంగానూ తమ హక్కుల కోసం పోరాడతామంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story