ఢిల్లీని మరోసారి ఊడ్చేస్తున్న ఆప్.. హ్యాట్రిక్ విక్టరీ దిశగా సీఎం కేజ్రీవాల్

ఢిల్లీని మరోసారి ఊడ్చేస్తున్న ఆప్.. హ్యాట్రిక్ విక్టరీ దిశగా సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ ఫలితాల్లో ఆప్ దూసుకుపోతోంది. హ్యాట్రిక్ కొట్టే దిశగా సీఎం కేజ్రీవాల్ దూసుకుపోతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా ప్రస్తుతం ట్రెండ్ కనిపిస్తోంది. ఇప్పటికే 40కి పైగా స్థానాల్లో ఆప్ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. గతంతో పోల్చుకుంటే బీజేపీకి స్వల్పంగా స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు 20 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఎర్లీ ట్రెండ్స్ చూస్తుంటే.. ఉదయం పది గంటలలోపే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సునాయసంగానే అందుకున్నట్టు ప్రస్తుతం ఫలితాలు కనిపిస్తున్నాయి.. ఇదే ట్రెండ్ కొనసాగితే మూడో సారి కేజ్రీవాల్ సీఎంగా పగ్గాలు చేపట్టనున్నారు.

ఉదయం 8 గంటల నుంచి మొత్తం 21 కేంద్రాల దగ్గర కౌంటింగ్ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story