చిన్న పిల్లల డాక్టర్ల బాధ్యత చాలా గొప్పది: ఈటెల రాజేందర్

చిన్న పిల్లల డాక్టర్ల బాధ్యత చాలా గొప్పది: ఈటెల రాజేందర్

మాతృత్వం తీయ్యటి కల అని.. ఆ కలను పరిపూర్ణం చేయడంలో చిన్నపిల్లల డాక్టర్ల బాధ్యత గొప్పదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లో ఇండియన్ అకాడమి ఆఫ్ పీడియాట్రిక్ ట్విన్ సిటీస్ బ్రాంచ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి ఈటెల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జంటనగరాల చిన్నపిల్లల వైద్యుల సమాఖ్య నూతన అధ్యకుడిగా డాక్టర్ నరసింహారెడ్డి ఎంపిక అయ్యారని డాక్టర్ మంచుకొండ రంగయ్య తెలిపారు. ఉప్పల్‌లో ఉగాది పండుగ రోజున IAP TCB భవనాన్ని ప్రారంభిస్తామని వైద్యులు నరసింహారెడ్డి, మంచుకొండ రంగయ్యలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story