కరోనా వ్యాప్తి వెనుక షాకింగ్‌ నిజాలు

కరోనా వ్యాప్తి వెనుక షాకింగ్‌ నిజాలు

చైనాతో సహా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి కారణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తికి కారణంగా అనుమానిస్తున్న జీవాయుధ తయారీ వెనుక ఉన్నది ఓ అమెరికన్‌ శాస్త్రవేత్త అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ పరిశోధనలో చైనా నుంచి ఆర్థిక సాయం పొందుతూ, సహకరిస్తున్న నానో సైంటిస్టు చార్లెస్‌ లీబర్‌ను అరెస్ట్‌ చేశారు.. తరువాత పూచికత్తుపై బెయిల్‌ ఇచ్చారు.

చార్లెస్‌ లీబర్‌ అనే శాస్త్రవేత్త వూహాన్‌ విశ్వవిద్యాలయంలో ఓ జీవ-రసాయన ల్యాబ్‌ను నెలకొల్పి- జీవాయుధాల రూపకల్పనలో పరోక్షంగా సహకరిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఆ పరిశోధనా క్రమంలోనే కరోనా వైరస్‌ బయట ప్రపంచంలోకి లీకై వుహాన్‌ను కమ్మేసిందన్న వాదన వినిపిస్తోంది. అధికారికంగా ధ్రువీకరించకపోయినప్పటికీ ఈ వైరస్‌ వ్యాప్తికి, వుహాన్‌ విశ్వవిద్యాలయ ల్యాబ్‌లో పరిశోధనలకు ఖచ్చితంగా సంబంధం ఉండే ఉంటుందని కథనాలు వెలువడుతున్నాయి.

అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో కెమిస్ట్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ చార్లెస్‌ లీబర్‌.. నానో టెక్నాలజీలో నిపుణుడు. ఎంతో మందికి మార్గదర్శకుడు. అలాంటి గొప్ప సైంటిస్టుని జనవరి 28న ఎఫ్‌బీఐ అధికారులు అకస్మాత్తుగా అరెస్టు చేశారు. కారణం.. చైనా నుంచి ఆర్థికసాయాన్ని అందుకుంటూ ఆ విషయాన్ని అమెరికా ప్రభుత్వానికి చెప్పకుండా దాచడం. అమెరికా చట్టం ప్రకారం ఏ పౌరడైనా విదేశీ సాయం పొందినపుడు.. సదరు సాయానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి కచ్చితంగా తెలియజేయాలి.

లీబర్‌తో పాటు మరో ఇద్దరు రిసెర్చి విద్యార్థులను కూడా ఎఫ్‌బీఐ అరెస్టు చేసింది. నిజానికి వీరిలో ఒకరు.. చైనా సైన్యంలో లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్నారు. రెండో వ్యక్తి లోగాన్‌ నుంచి చైనాకు విమానం ఎక్కబోతుండగా అదుపులోకి తీసుకుని అతని దగ్గర నుంచి 21 అత్యంత శక్తిమంతమైన జీవపరిశోధన శాంపిల్స్‌ను స్వాధీన పరుచుకున్నారు. రెండు రోజుల పాటు చార్లెస్‌ లీబర్‌ను నిశితంగా ప్రశ్నించాక.. ఏకంగా 10 లక్షల డాలర్ల పూచీకత్తు మీద ఆయనకు స్థానిక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అదే సమయంలో దేశం విడిచిపోరాదని ఆంక్ష పెట్టింది. ఈ కేసు గురించి బయటకు పొక్కాక- హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం ఆయన పరిశోధనలను ఆపేసి, ఆయనను సస్పెండ్‌ చేసింది. ఆయనను సెలవుపై పంపేసి, క్యాంప్‌సలో అడుగుపెట్టవద్దని ఆంక్ష విధించింది.

చైనా సాగిస్తున్న థౌజండ్‌ టాలెంట్స్‌ ప్లాన్‌పై ఎప్పటినుంచో అమెరికా కన్నుంది. అది తమ దేశానికి, ఇతర దేశాలకు చెందిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తలను ఆకర్షించి- మేధాసంపత్తి హక్కులను హరిస్తుందన్నది అమెరికా భయం. దాన్ని దెబ్బతీయాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. అలాంటి ప్లాన్‌కు హార్వర్డ్‌ ప్రొఫెసర్‌ పనిచేస్తారని అమెరికా ఊహించలేదు. లీబర్‌ అరెస్టుతో కరోనావైరస్‌ వ్యాప్తికి కారణాలపై శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. నిజంగానే ఈ వైరస్‌ వుహాన్‌ విశ్వవిద్యాలయంలోని ల్యాబ్‌లో సాగుతున్న పరిశోధనల్లోనే డెవలప్‌ అయిందా..? నిజమైతే లీకేజికి కారణాలేంటి..? బయటకు చెప్పకపోయినా లీబర్‌ అరెస్టుకు- కరోనా అభివృద్ధికి మధ్య సంబంధం ఏదేనా ఉందా, అరెస్టు చేసిన ఇద్దరు చైనా స్కాలర్ల నుంచి బయటపడ్డ వయల్స్‌లో ఏముంది.. మొదలైన వాటిపై ఎఫ్‌బీఐ ఆరాతీస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story