అధికారుల కాలు పట్టుకున్న నిమ్మల రామానాయుడు

అధికారుల కాలు పట్టుకున్న నిమ్మల రామానాయుడు

తొలగించిన పేదల పెన్షన్లను వెంటనే తిరిగి ఇవ్వాలని కోరుతూ వినూత్నంగా నిరసన తెలిపారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. అధికారుల కాళ్లు పట్టుకున్నారు. పాలకొల్లు మున్సిపల్, తహశీల్దార్ కార్యాలయాల ముందు.. వృద్ధులు, వికలాంగులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ధర్నా చేశారు. ప్రభుత్వం వివిధ కారణాలు చూపుతూ రద్దుచేసిన పెన్షన్లను వెంటనే ఇవ్వాలని కోరారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలకు, కరెంట్‌తో ముడిపెట్టలేదని నిమ్మల గుర్తుచేశారు. దిక్కులేని వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు కట్ చేయడం దారుణం అన్నారు నిమ్మల రామానాయుడు. ఒక చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి.. మరో చేత్తో లాక్కోవడం ఒక్క జగన్‌ ప్రభుత్వానికే చెల్లింని ఆయన ఎద్దేవా చేశారు.

Tags

Next Story