తన తండ్రిపై ఆరోపణలను ఖండించిన ఏబీ వెంకటేశ్వర్రావు కొడుకు చేతన్‌ సాయి

తన తండ్రిపై ఆరోపణలను ఖండించిన ఏబీ వెంకటేశ్వర్రావు కొడుకు చేతన్‌ సాయి

సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వర్రావుపై వస్తున్న ఆరోపణలను ఖండించారు ఆయన తనయుడు చేతన్‌ సాయి కృష్ణ. తాను ఇంత వరకు ఏ ప్రభుత్వంతో కాని.. మరే ప్రభుత్వ శాఖతో కాని ఎలాంటి సంబంధాలు కొనసాగించలేదని వివరణ ఇస్తూ లేఖ రాశారు. ఏపీలో కాని, ఇతర రాష్ట్రాల్లో కాని తాను ఎలాంటి వ్యాపారం చేయలేదన్నారు. ఇప్పటి వరకు తాను ఏ టెండర్‌లోనూ పాల్గొనలేదని చేతన్‌ సాయి లేఖలో వివరణ ఇచ్చారు.

తన తండ్రి పేరును వాడుకొని ఏనాడూ వ్యాపారం చెయ్యడం గాని లాభం పొందడం కానీ చేయలేదన్నారు. తన తండ్రి పై విషప్రచారం జరుగుతుండడంతోనే ఇలా వివరణ ఇవ్వాల్సి వచ్చింది అన్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపకపోతే న్యాయ పరమైన చర్యలు తీసుకుంటానని లేఖలో హెచ్చరించారు.

Tags

Next Story