ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం
X

మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌ఛార్జ్‌లు, జిల్లా అధ్యక్షులు, సీనియర్లు అంతా ఈ మీటింగ్‌కి వస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఎలాంటి వ్యూహం ఉండాలనే దానిపై చర్చించేందుకే ఈ మీటింగ్‌ పెట్టారు. అటు, రాజధాని అమరావతిపై పోరాటం ముందుకు తీసుకెళ్లడంపైనా సమీక్షిస్తారు. పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుని ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటానికి కార్యాచరణ రూపొందించడంపై చర్చిస్తారు. అలాగే గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకు వేధింపుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Next Story

RELATED STORIES