57 రోజలుగా ప్రాణం పెట్టి పోరాడుతున్నా.. ప్రభుత్వంలో చలనం లేదు
57 రోజలుగా ప్రాణం పెట్టి పోరాడుతున్నా.. అమరావతిపై ప్రభుత్వం కాంప్రమైజ్ కావటం లేదు. రాజధానిలో అభివృద్ది పనులు అడుగు ముందుకు పడటం లేదు. వేల మంది రైతులు పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదు. అటు కేంద్రం కూడా రాజధాని విషయంలో తమకేమి సంబంధం లేదన్నట్లు చేతులేత్తేసింది.
శాంతియుతంగా పోరాడుతున్నా..వేల మంది రైతులు వారి కుటుంబాలు, ఇతర జిల్లాల రైతులు తరలొస్తున్నా ప్రభుత్వం కనికరించకపోవటంతో అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని జేఏసీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంది. ఇందులో భాగంగా గడప గడపకు అమరావతి పేరుతో జేఏసీ సభ్యులు అమరావతి గ్రామాల్లో పర్యటించనున్నారు. తొలి రోజున మందడం, వెలగపూడి, తుళ్లూరు ప్రాంతాల్లో జేఏసీ ప్రతినిధుల బృందం పర్యటిస్తుంది.
ఏపీ అభివృద్ధికి అమరావతి రాజధానిగా కొనసాగించటంతో పాటు.. దళిత, బడుగు, బలహీన,మైనార్టీ వర్గాల్లో చైతన్యం తెచ్చేందుకు జేఏసీ తన వంతు ప్రయత్నం చేస్తోంది. అమరావతి రాజధాని తరలింపు నేపథ్యంలో రాష్ట్రానికి జరగనున్న నష్టంపై రాజధాని గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తామని జేయేసీ సభ్యులు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఓ సామాజిక వర్గంపై ఉన్న కక్షతో పాటు రాజకీయ వ్యక్తిగత విద్వేషంతో అమరావతి గొంతు నులిమివేస్తున్నాడని చెబుతోంది.
జనంలో చైతన్యం తీసుకొచ్చేలా జేఏసీ రెడీ అవుతుండగా..మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బస్సు యాత్ర చేపట్టేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈనెల 17 నుంచి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజాచైతన్య యాత్ర చేపట్టాలని తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. సుమారు 45 రోజులపాటు యాత్ర కొనసాగే అవకాశముంది. ఈ బస్సు యాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంతో పాటు, పెట్టుబడులు, మూడు రాజధానులు, సంక్షేమ పథకాల్లో కోత వంటి అంశాలను యాత్రలో ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే బస్సు యాత్ర రూట్ మ్యాప్ వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com