ఏపీలో డబ్బు పంచుతూ అభ్యర్థి పట్టుబడితే అనర్హత వేటు, మూడేళ్ళ జైలు శిక్ష!
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది మార్చి 15 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. 13 నుంచి 15 రోజుల్లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని నిర్వహించాలని నిర్ణయించింది. కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ప్రచార గడువును విధించింది. అంతేకాదు డబ్బు మద్యం లేకుండా ఎన్నికలు నిర్వహించేలా నిబంధనలు విధించింది. డబ్బు పంచుతూ అభ్యర్థి పట్టుబడితే అనర్హత వేటు వేయాలని నిర్ణయించింది.
అంతేకాదు మూడేళ్లపాటు జైలు శిక్ష విధించేలా చర్యలు చేపట్టింది. మున్సిపల్ ఎన్నికల్లో పంచాయితీ ఎన్నికల నియమావళి ఉండేలా చర్యలు చేపడుతోంది. సర్పంచ్ స్థానికంగా ఉండేలా నిబంధనలు విధించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఏపీ స్టేట్ అగ్రికల్చర్ ముసాయిదా బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com