రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత కలకలం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత కలకలం
X

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత కలకలం రేపింది. స్థానికంగా చిరుత సంచారంపై విజువల్స్ కూడా వైరల్ కావడంతో.. ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. పాదముద్రలను బట్టి దాన్ని గుర్తించారు. పట్టుకునేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. కోనరావుపేట మండలం మల్కంపేట రిజర్వాయర్‌ వద్ద చిరుత ఉన్నట్టు నిర్థారణకు వచ్చాక అక్కడ ఉచ్చులు ఏర్పాటు చేశారు. వ్యవసాయ పనుల కోసం వెళ్లేవాళ్లు ఎవరూ ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.

Tags

Next Story