అధికారులకు ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండొద్దు : సీఎం కేసీఆర్

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. కలెక్టర్ల వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేయాలని నిర్ణయించిందన్నారు. కలెక్టర్లపై ప్రభుత్వం ఏంతో నమ్మకం ఉంచిందని, అధికార యంత్రాంగం అంతా ఒక టీమ్ లాగా పనిచేయాలన్నారాయన. అధికారులకు ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండొద్దని కలెక్టర్లకు స్పష్టం చేశారు సీఎం కేసీఆర్..
ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమాలు అమలుపై కలెక్టర్లు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలన్నారు సీఎం కేసీఆర్. పాలనలో వేగం, ప్రజలకు మరింత చేరువకావడం, ప్రజల వినతులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను మరింత ప్రభావవంతంగా అమలుచేయడం.. వంటి ప్రధాన అంశాలపై చర్చించారు. పురపాలక, పంచాయతీరాజ్‌చట్టాల అమలుతోపాటు కొత్త రెవెన్యూచట్టం, భూవివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా ముఖ్యమంత్రి కలెక్టర్లతో చర్చించారు..
ఎస్సీ, ఎస్టీల్లో అక్షరాస్యతను పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా తక్కువ వ్యవధిలోనే అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించామన్నారాయన. సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని, 40 వేల కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. అనేక రకాల చర్చోపచర్చలు నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెస్తోందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com