బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు కొత్త వ్యూహంతో సిద్ధమైన కాంగ్రెస్

బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు కొత్త వ్యూహంతో సిద్ధమైన కాంగ్రెస్

రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇదే అంశాన్ని రాజకీయంగా అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. రిజర్వేషన్లను ఎత్తేయాలని ఆర్ఎస్ఎస్ ఎజెండా అని మోదీ సర్కార్ అంశాల వారీగా అమలు చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తోంది హస్తం పార్టీ. అందులో భాగంగానే మోదీ సర్కార్.. సుప్రీంకోర్టుకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వాదన వినిపించిందంటున్నారు ఆ పార్టీ నేతలు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ గళం వినిపిస్తుంది. మోదీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో నగరాల్లో ర్యాలీలు, సభలతో హోరెత్తిస్తున్నారు హస్తం నేతలు. కాంగ్రెస్ ఆందోళనలతో మోదీ సర్కార్ డిఫెన్స్ లో పడే పరిస్థితిని క్రియేట్ చేశారు.

రిజర్వేషన్ల అంశాన్ని ఆయుధంగా వాడుకునేందుకు సిద్ధమవుతున్నారు హస్తం పార్టీ నేతలు. సుప్రీంకోర్టులో కేంద్రం వినిపించిన వాదనలు, కోర్టు చేసిన కామెంట్స్ ను జనంలో తీసుకెళ్లనున్నారు. ఈ నెలాఖరు వరకు దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల పీసీసీలకు, ఏఐసిసి ఆదేశాలు జారీ చేసింది. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ ఆందోళనలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.

దేశంలో మెజారిటీ ప్రజలకు వ్యతిరేకంగా మోదీ సర్కార్ తీసుకుంటున్న రిజర్వేషన్ వ్యతిరేక నిర్ణయాన్ని రాజకీయంగా తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే దీన్ని సాధ్యమైనంత ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్లి మోదీ సర్కార్ ను బదనాం చేయాలని పక్కా వ్యూహంతో ముందుకు వెళుతుంది.

Tags

Read MoreRead Less
Next Story