కరోనా వైరస్ పేరు మారింది.. కొవిడ్-19గా నామకరణం..

కరోనా వైరస్ పేరు మారింది.. కొవిడ్-19గా నామకరణం..

చైనాను ఉక్కిరి బిక్కిరి చేస్తూ.. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా పేరు మారింది. కొవిడ్-19గా ప్రపంచ ఆరోగ్య సంస్థ - WHO నామకరణం చేసింది. కరోనా, వైరస్, డిసీజ్‌.. అనే ఆంగ్లపదాల తొలి అక్షరాలను కలిపితే కొవిడ్‌గా పేరు పెట్టారు. చైనాలోని వుహాన్‌లో గతేడాది డిసెంబర్‌లో కరోనా వైరస్‌ ఉనికి బయటపడింది. దీంతో.. కొవిడ్ చివరు ఆ ఏడాదినీ చేర్చారు. కొవిడ్‌-19గా WHO వ్యవహరించనుంది. మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం చైనా చేరుకుంది. కరోనాను కట్టడి చేసేందుకు బ్రూస్ ఐల్వార్డ్ నేతృత్వంలో కార్యాచరణ మొదలుపెట్టారు.

కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. ఒక్కో రోజు వందల మంది చనిపోతున్నారు. నిన్నటివరకు మృతి చెందినవారి సంఖ్య వెయ్యి దాటిపోయింది. 11 వందలు సమీపిస్తోంది. మరో 50 వేల మంది వరకు మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. వీరిలో 8 వేల మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని బతికించేందుకు చైనా వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. సుమారు 1 లక్ష 90 వేల మందిపై వైద్య పరిశీలన కొనసాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story