ఏపీలో మార్చి 15లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు

ఏపీలో మార్చి 15లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు

ఏపీలో మార్చి 15లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నోటిఫికేషన్ నుంచి 15 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయనున్నారు. డబ్బు, మద్యం, ప్రలోభాలకు ఆస్కారం లేకుండా చట్టాన్ని కఠినతరం చేయనున్నారు. మరోవైపు సర్పంచ్‌లకు మరిన్ని అధికారాలు కల్పించిన కేబినెట్‌.. స్థానికంగా నివాసం ఉండాలనే నిబంధన విధించారు.

ఏపీ మంత్రిమండలి సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ విద్యలో నాణ్యత పెంచేందుకు కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ శాఖల దగ్గరున్న నిధుల పొదుపు కోసం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్, సౌర విద్యుత్ ఉత్పత్తికి జెన్‌కో నేతృత్వంలో గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ పచ్చజెండా ఊపింది.

Tags

Read MoreRead Less
Next Story