ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల పోరుబాట
ఏపీఎస్- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. అనంతరం కార్మికుల సమస్యలను జగన్ సర్కార్ పట్టించుకోకపోవడంపై ఆర్టీసీ ఉద్యోగులు పోరుబాట పట్టారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో ముందు ఉద్యోగులు రిలే నిరాహార దీక్షకు దిగారు. ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ ఆందోళనలు చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం పేరుతో.. ఉద్యోగులకు ఉన్న సౌకర్యాలను తొలగించే విధానాలు మానుకోవాలని కోరుతున్నారు. విలీనం పేరుతో తొలగించిన ఎస్‌బీటీ ట్రస్ట్‌లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఓల్డు పెన్సన్ స్కీమ్ వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే సీసీఎస్ నుండి యాజమాన్యం వాడుకున్న 350 కోట్ల రూపాయలను వెంటనే వడ్డీతో చెల్లించి ఉద్యోగులకు బుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com