దిశ యాప్‌తో తొలి కేసు.. 6 నిమిషాల్లో పని పూర్తి చేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్‌లో దిశ యాప్‌తో తొలి కేసు నమోదైంది. మంగళవారం ఉదయం ఓ మహిళా అధికారి విశాఖపట్నం నుంచి విజయవాడకు బస్సులో వెళ్తుండగా.. తోటి ప్రయాణికుడొకరు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ వెంటనే దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారాం ఇచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు రంగంలోకి దిగి.. ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
వేధింపులకు గురైన మహిళ ఫిర్యాదు అందిన 6 నిమిషాల్లోనే ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం విశేషం. ఉదయం 04.21 గంలకు మంగళగిరి దిశ కాల్ సెంటర్‌కు ఈ కాల్ వెళ్లింది. అక్కడి నుంచి కాల్ సెంటర్ ద్వారా దగ్గరలోని ఎమర్జెన్సీ సెంటర్‌కు సమాచారమందింది. రంగంలోకి దిగిన ఏలూరు త్రీటౌన్ పోలీసులు 04.27 నిమిషాలకు బాధితురాలి వద్దకు చేరుకున్నారు. నేరుగా బస్సులోకి వెళ్లి వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతరం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళా అధికారిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని ప్రొఫెసర్‌గా గుర్తించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com