కర్నూలు చేరుకున్న పవన్.. రెండు రోజుల పర్యటన ఇలా..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండ్రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. కొద్ది సేపటి క్రితం ఆయన కర్నూలుకు చేరుకున్నారు. పుల్లూరు టోల్ ప్లాజ్ వద్ద ఘనస్వాగతం పలికారు ఆ పార్టీ నేతలు, అభిమానులు. బుధవారం కర్నూలు, గురువారం ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. కాసేపట్లో ప్రీతీ బాయ్ కేసు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ భారీ నిరసన ర్యాలీ చేయనున్నారు. ఈ ర్యాలీలో పాల్గొంటున్న పవన్ కల్యాణ్.. అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు.
నగరశివారులోని జోహరాపురం వంతెన సందర్శించి, తాండ్రపాడులోని జీప్లస్ గృహాలను పరిశీలిస్తారు. గురువారం మధ్యాహ్నం ఎమ్మిగనూరులో ఆగిపోయిన టెక్స్‌టైల్ పార్క్‌ను సందర్శించారు. అక్కడ ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించి.. చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com