ఆంధ్రప్రదేశ్

ఒకే దేశం ఒకే పార్టీ: ఎమ్మెల్సీ మాధవ్

ఒకే దేశం ఒకే పార్టీ: ఎమ్మెల్సీ మాధవ్
X

ఒకే దేశం ఒకే పార్టీ నినాదంతో.. ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తామని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్‌ అన్నారు. పార్వతీపురం బీజేపీ కార్యాలయంలో పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మాధవ్‌.. జనసేనతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉండే పార్టీలన్నీ కుటుంబపార్టీలని, వ్యాపార లావాదేవీల దృక్పథంతో పనిచేస్తున్నాయన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రాజధాని పేరిట వ్యాపారం చేసిందన్నారు. దీనిపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారాయన.

Next Story

RELATED STORIES