సందిగ్ధత ఉన్నపుడే విచక్షణాధికారాలు వర్తిస్తాయి: పిల్లి సుభాష్ చంద్రబోస్
మండలి చైర్మన్ తన విచక్షణాధికారాలను.. ఎప్పుడుపడితే అప్పుడు వాడకూడదన్నారు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్. కేవలం సందిగ్దత ఉన్నప్పుడు మాత్రమే విచక్షణాధికారాలు వర్తిస్తాయన్నారు. ఓటింగ్ జరగకుండా బిల్లును సెలెక్ట్ కమిటీకి ఎలా పంపుతారని ప్రశ్నించారు. మండలి చైర్మన్ తన అధికారాలను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు మండలి గ్యాలరీకి వచ్చి సభ్యులను ప్రభావితం చేశారని ఆరోపించారు. సెలెక్ట్ కమిటీని చూసి భయపడాల్సిన దౌర్భాగ్యం తమకు లేదన్నారు.
నిబంధనల ప్రకారం వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు ఆమోదానికి శాసనమండలిలో పెట్టామన్నారు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్. అయితే ఈ బిల్లులను ప్రధాన ప్రతిపక్షం ఆమోదం, తిరస్కరణ, లేదా సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశం ఉందన్నారు. కానీ ప్రతిపక్షం ఈ మూడు అవకాశాలను వినియోగించుకోనందున ఆ బిల్లు ఆమోదం పొందినట్టే అని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com