నేడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం

నేడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. గతంలో ఓ సారి ఢిల్లీ వెళ్లినా.. ప్రధాని అపాయింట్ మెంట్ దొరక్కపోవటంతో తిరిగి వచ్చేశారు. ఇవాళ్ల తర్వాత మళ్లీ ఢిల్లీ పయనం అవుతున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్రం పెద్దలతో జగన్ సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. శాసనమండలి రద్దుతో అమరావతి తరలింపుపై ఫిర్యాదుల నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటనపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

అయితే.. ఇవాళ ఉదయం రాష్ట్ర కేబినెట్ ఉంది. మంత్రిమండలి సమావేశం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్‌ ఢిల్లీ బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సాయంత్రం 4 గంటల పది నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అవుతారు. రాష్ట్ర సమస్యలను సీఎం జగన్... ప్రధాని దృష్టికి తీసుకెళ్తారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తెస్తారని అధికార వర్గాల సమాచారం. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులకు తగిన కేటాయింపుల జరపని విషయాన్ని ప్రధాని దృష్టికి తేనున్నారు.

అలాగే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పనతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను మరోసారి ప్రధానితో చర్చించనున్నట్టుగా సమాచారం. ఈ భేటీలో రాజధాని అమరావతి అంశం సహా శాసన మండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. శాసనమండలి రద్దు ప్రక్రియను వేగవంతం చేయటంతో పాటు..అమరావతి తరలింపుపై వచ్చిని ఫిర్యాదులు, మూడు రాజధానుల ఆవశ్యతను మోదీకి తెలియజేసే అవకాశాలు ఉన్నాయి. ప్రధానితో భేటీ తర్వాత ఇవే అంశాలతో హోంమంత్రి అమిత్‌ షా తోనూ చర్చించే అవకాశాలు ఉన్నాయి. అనంతరం రాత్రి 7 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ నుంచి తిరుగు పయనమవుతారు. రాత్రి 9.40 గంటలకి ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story