అరెస్టులకు నిరసనగా లోకేష్ ర్యాలీ

అరెస్టులకు నిరసనగా లోకేష్ ర్యాలీ

అమరావతి ఉద్యమంలో అరెస్టై నందిగామ సబ్‌ జైల్లో ఉన్న యువకులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సబ్‌జైల్‌ వద్దకు తరలివచ్చారు. సబ్‌ జైల్లో యువకులను పరామర్శించిన తరువాత అక్రమ అరెస్టులకు నిరసనగా చేపట్టిన ర్యాలీలో లోకేష్ పాల్గొన్నారు. నందిగామలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని లోకేష్‌ డిమాండ్ చేశారు.

Tags

Next Story