రోజుకో కొత్త డ్రామాతో శిక్ష అమలు నుంచి తప్పించుకుంటున్న నిర్భయ దోషులు

రోజుకో కొత్త డ్రామాతో శిక్ష అమలు నుంచి తప్పించుకుంటున్న నిర్భయ దోషులు

నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన ముఖేశ్‌ సింగ్‌, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తా రోజుకో కొత్త డ్రామాతో శిక్ష అమలు నుంచి తప్పించుకుంటున్నారు. దోషులందరికీ ఒకే సారి శిక్ష అమలు కావాలనే నిబంధనే వాళ్లకు బాగా సాకుగా మారింది. ఒకరి తర్వాత ఒకరు కోర్టుకు వెళ్లటం, క్షమాభిక్షకు పిటీషన్ పెట్టుకోవటం..మళ్లి ఉరి శిక్ష అమలు ఆలస్యం కావటం జరుగుతూ వస్తోంది.

ఏడేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులైన ముఖేశ్‌ సింగ్‌, అక్షయ్‌ ఠాకూర్‌ ఇప్పటికే న్యాయపరమైన అన్ని అవకాశాలు ఉపయోగించుకున్నారు. ఇక వినయ్‌ శర్మ పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించగా... పవన్‌ గుప్తా కేవలం రివ్యూ పిటిషన్‌ మాత్రమే దాఖలు చేశాడు. తీరా కోర్టు విచారణకు రాగానే తనకు న్యాయవాది లేడని లాయర్ ఏర్పాటు చేసుకునేందుకు కొంత సమయం కావాలని కోరాడు. పవన్ గుప్తా విజ్ఞప్తిపై స్పందించిన సుప్రీం కోర్టు తామే లాయర్ ను ఏర్పాటు చేస్తామని, ఎంపానెల్డ్ లాయర్ల జాబితా నుంచి ఒకరిని ఎంచుకోవాలని సూచించింది. కేసును గురువారానికి వాయిదా వేసింది ఢిల్లీ కోర్టు.

కేసు మరోసారి వాయిదా పడటంతో నిర్భయ తల్లి తీవ్ర నిరూత్సాహానికి గురయ్యారు. నిర్భయ దోషులను వెంటనే ఉరి తీయాలని నిర్భయ తల్లి వేడుకున్నారు. దోషులకు శిక్ష అమలు ఆలస్యం కావడంపై కోర్టులోనే ఆమె కన్నీరు మున్నీర య్యారు. శిక్ష అమలను ఆపడానికి దోషులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, కోర్టులు ఎందుకు అర్థం చేసుకోవడం లేదని నిలదీశారు.

నిర్భయ తల్లి ప్రశ్నలపై స్పందించిన కోర్టు, ప్రతి దోషికి తన చివరి శ్వాస వరకు న్యాయ సహాయం పొందే అర్హత ఉందని తెలిపింది.

అయితే..దోషులకు శిక్ష అమలుపై మహిళా సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దోషులకు వాదనలు వింటున్న న్యాయస్థానాలు బాధితుల వానదనలను ఎందుకు పరిగణలోకి తీసుకోవటం లేదని ప్రశ్నిస్తున్నాయి.

దోషులకు తుది శ్వాస వరకు న్యాయసాయం తీసుకునే అవకాశం ఉందని కోర్టు స్పష్టత ఇవ్వటం..నలుగురు దోషులు తమకు ఉన్న అన్ని మార్గాల ద్వారా శిక్ష అమలును జాప్యం చేస్తుండటం బాధితుల కుటుంబం, మహిళా సంఘాలకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. సుప్రీం కోర్టే దోషులకు డెత్ వారెంట్ జారీ చేయాలని నిర్భయ తల్లి కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story