జగన్ ఢిల్లీ పర్యటన నిధుల కోసమా? కేసుల కోసమా? : యనమల
BY TV5 Telugu13 Feb 2020 3:20 PM GMT

X
TV5 Telugu13 Feb 2020 3:20 PM GMT
జగన్ ఢిల్లీ పర్యటన నిధుల కోసమా? కేసుల కోసమా? అని ప్రశ్నించారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. జగన్ ఢల్లీ పర్యటన వివరాలను ఎందుకు రహస్యంగా ఉంచారో చెప్పాలన్నారు. విభజన చట్టం హామీలపై వైసీపీ కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదన్నారు. జగన్ ప్రధాని మోడీకి శాసనమండలి విషయంలో తప్పుడు సమాచారమిచ్చారన్నారు. టీడీపీ శాసనమండలిలో బిల్లులు అడ్డుకుంటుందని చెప్పడాన్ని యనమల ఖండించారు.
సీఎం ఢిల్లీ పర్యటనతో... కనీసం విమాన ఖర్చులను కూడా కేంద్రం నుంచి రాబట్టుకోలేక పోయారన్నారు. ప్రధానితో ఎన్ని నిమిషాలు మాట్లాడారనేది ముఖ్యం కాదని, రాష్ట్రానికి ఏం తెచ్చారన్నదే ముఖ్యమన్నారు. ఏపీ సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్ తరాలకు తీవ్రమైన ఇబ్బందులు తెచ్చిపెడుతుందన్నారు యనమల.
Next Story