పుల్వామా అమరజవాన్లకు వినూత్నరీతిలో నివాళి అర్పించిన గాయకుడు

పుల్వామా అమరజవాన్లకు బెంగళూరుకు చెందిన ఓ గాయకుడు వినూత్నరీతిలో నివాళి అర్పించాడు. వీర జవాన్లకు నివాళి అర్పించేందుకు ఉమేశ్ గోపీనాథ్ అనే సింగర్.. ఏకంగా 61 వేల కిలోమీటర్లు తిరిగాడు. పుల్వామా ఘటనలో అమరులైన ప్రతి సైనికుడి ఇంటికి వెళ్లాడు. ఆ సైనికుల కుటుంబసభ్యులను కలిసి మాట్లాడాడు. వారి ఇంటి ముందున్న మట్టితో పాటు, సైనికులను దహనం చేసిన ప్రాంతం నుంచి మట్టిని ఓ కలశంలో సేకరించాడు.
మట్టి సేకరించిన కలశంతో దేశమంతా తిరిగాడు. పుల్వామా దాడికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో.. కశ్మీర్‌లోని లెత్‌పోరా క్యాంపు వద్ద ఏర్పాటు చేసిన స్థూపం వద్ద.. ఆ కలశాన్ని పెట్టారు. అమర సైనికులకు తాను ఇచ్చే ఘనమైన నివాళి ఇదేనని గర్వంగా చెప్పాడు ఉమేశ్. ఉమేశ్ దేశభక్తిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com