హార్దిక్ పటేల్ కనిపించడం లేదు అంటూ భార్య ఆరోపణ

హార్దిక్ పటేల్ కనిపించడం లేదు అంటూ భార్య ఆరోపణ

పాటిదార్ కమ్యూనిటీ, పటిదార్ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు హార్దిక్ పటేల్ గత 20 రోజులుగా కనిపించడం లేదంటూ ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. గత 20 రోజులుగా నా భర్త తప్పిపోయాడు, ఆయన ఆచూకీ గురించి మాకు సమాచారం లేదు. ఆయన కనిపించకపోవడం పట్ల మాకు మేము తీవ్ర ఆందోళన చెందుతున్నామని ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. అంతేకాదు కొంతకాలంగా పేద ప్రజలకోసం గుజరాత్ ప్రభుత్వంపై పోరాడుతోన్న తన భర్తను ఇబ్బందులు పెడుతున్నారని.. తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

పటిదార్ ఉద్యమంలో నమోదైన కేసులను తిరగదోడతామని చెప్పిన ప్రభుత్వం కేవలం హార్దిక్ కేసును మాత్రమే పైకి తెచ్చారని.. గతంలో పటిదార్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఇటీవల బీజేపీలో చేరిన ఇద్దరు పాటీదార్లను ప్రభుత్వం ఎందుకు వదిలేసిందని ఆమె ప్రశ్నించారు. కాగా మంగళవారం ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అభినందిస్తూ పటేల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

Tags

Next Story