ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వరరావు

ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వరరావు

సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. తనపై సస్పెన్షన్‌ చట్టవిరుద్ధమని ప్రకటించాలంటూ ఆయన క్యాట్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. గత ఏడాది మే 31 నుంచి తనకు వేతనం చెల్లించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలతో సస్పెండ్‌ చేయడం చట్టవిరుద్ధమన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో జారీ చేసిన సస్పెన్షన్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని క్యాట్‌ను ఏబీ వెంకటేశ్వరరావు కోరారు.

Tags

Read MoreRead Less
Next Story