ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న జనసేనాని

కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న జనసేనాని
X

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మిగనూరులో చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ రాత మాత్రం మారడం లేదని ఈ సందర్భంగా చేనేత కార్మికులు పవన్‌ కల్యాణ్‌ ముందు వాపోయారు. తాము పడే కష్టానికి ఫలితం దక్కడం లేదన్నారు. చేనేత క్లస్టర్‌ ఏర్పాటయ్యేలా చొరవ తీసుకోవాలని చేనేత కార్మికులు పవన్‌ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలన్నీ విన్న పవన్‌.. న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం అమలు చేయాలని జనసేనాని డిమాండ్ చేశారు. రెండు వారాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు గుర్తించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

Next Story

RELATED STORIES