అనంతపురంలో ఉద్రిక్తతకు దారితీసిన ల్యాండ్ పూలింగ్
BY TV5 Telugu13 Feb 2020 7:40 PM GMT

X
TV5 Telugu13 Feb 2020 7:40 PM GMT
అనంతపురం జిల్లా సోమందేవిపల్లి మణికంఠ కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాతల కాలం నుండి సాగుచేసుకుంటున్న భూములను.. ఇళ్ల పట్టాల కోసం రెవెన్యూ అధికారులు లాక్కుంటున్నారని భూయజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా భూములను బలవంతంగా తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యజమానులు అడ్డురాకుండా భారీగా పోలీసులను మోహరించి భూములు లాక్కోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Next Story