జూబ్లీహిల్స్‌ సీఆర్‌పీఎఫ్‌ సదరన్ సెక్టార్ హెడ్‌ క్వార్టర్స్‌లో వీరసైనికులకు నివాళి

పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి నేటితో ఏడాదైంది. ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు సీఆర్‌పీఎఫ్‌ అధికారులు నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లోని సీఆర్‌పీఎఫ్‌ సదరన్ సెక్టార్ హెడ్‌ క్వార్టర్స్‌లో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఆర్‌పిఎఫ్‌ అధికారులతో పాటు గతంలో వివిధ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈసభలో సీఆర్పీఎఫ్ అమరుల వివరాలతో ఓ పుస్తకాన్నివిడుదల చేశారు.

విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్ ఐజీ నాయక్. గత పదేళ్లలో ఏపీ, తెలంగాణకు చెందిన 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వివిధ ఘటనల్లో వీర మరణం పొందారన్నారు. వీరి కుటుంబాలకు పెన్షన్, గ్రాట్యుయిటీ లాంటి సమస్యలుంటే పరిష్కరించడానికి ఒక స్పెషలాఫీసర్‌ని నియమించామన్నారు.. అమరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిప్పించేందుకు కూడా కృషి చేస్తున్నామని తెలిపారు ఐజీ నాయక్.

దేశ అంతర్గత రక్షణలో సీఆర్‌ఎఫ్‌ కీలకపాత్ర పోషిస్తోందన్నారు సీఐఐ తెలంగాణ ప్రెసిడెంట్ రాజు. దేశ భద్రతతో పాటు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లోకి వెళ్లి సీఆర్పీఎఫ్ చేసే సేవ గొప్పదన్నారు. ప్రతీ పౌరుడు దేశ రక్షణకు పాటు పడాలని పిలుపునిచ్చారు. సీఐఐ తరపున సీఆర్పీఎఫ్ అమరుల కుటుంబాలకు సాయమందిస్తామన్నారు ఆయన.

Tags

Read MoreRead Less
Next Story