సీబీఐ, ఈడీ నాపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలే : విజయ్ మాల్యా

CBI, EDలు తనపై చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమంటున్నారు విజయ్ మాల్యా. వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి నాలుగేళ్ల క్రితం లండన్ చేక్కేసిన మాల్యా.. ప్రస్తుతం అక్కడ వెస్ట్‌మినిస్టర్ కోర్టులో జరుగుతున్న విచారణకు హాజరయ్యారు. మాల్యాను ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న టైమ్‌లో.. బ్యాంకులకు ఇవ్వాల్సిన అసలు మొత్తం వంద శాతం తిరిగి ఇచ్చేస్తానని చేతులు జోడించి మరీ చెప్పుకొచ్చాడు. తను తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించడం లేదని చెప్తూ ED ఆస్తులు జప్తు చేసిందని, మనీ లాండరింగ్‌కి తాను పాల్పడలేదని అన్నారు. PMLA కింద తనపై సుమోటో కింద కేసులు నమోదు చేశారని అన్నారు. బ్యాంకులు రుణంగా ఇచ్చిన అసలు మొత్తాన్ని తీసుకోవాలని కోరారు. తన ఆస్తులపై ED ఒక పక్క.. బ్యాంకులు మరో పక్క పోరాడుతున్నాయన్నారు. తనకు డబ్బులు ఎగ్గొట్టే ఉద్దేశం లేదని బుద్ధిమంతుడిలా చెప్పుకొచ్చాడు. మూడో రోజు విచారణకు హాజరైన సందర్భంలో కోర్టు బయట మాల్యా మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనం అయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com