పెళ్లి ఇంట విషాదం.. పెళ్లి కొడుతు మృతి

పెళ్లి ఇంట విషాదం.. పెళ్లి కొడుతు మృతి

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బ్రాహ్మణగల్లి లో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి జరిగిన గంటల్లోనే పెళ్లి కొడుకు గుండెపోటుతో మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బోధన్ పట్టణానికి చెందిన 25 ఏళ్ల గణేష్ అనే యువకుడికి సాలూరు గ్రామానికి చెందిన స్వప్నతో శుక్రవారం వివాహం జరిగింది. పెళ్లి వేడుకలు ముగిసిన అనంతరం పెళ్లి భరాత్ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుకు గణేష్ తన స్నేహితులతో కలిసి పెళ్లి బారాత్‌లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఆనంద సమయంలోనే గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు.

స్నేహితులు కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పెళ్లి మండపం లోనే మృత్యుగంట మోగడం తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లి కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదన పలువురిని కంటతడి పెట్టించింది. పెళ్లైన కొన్ని గంటలకే పెళ్లికొడుకు మృతి చెందడంతో ఆ నవ వదువు కన్నీటి పర్యంతమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story