నిర్భయ కేసు విచారణ.. సొమ్మసిల్లి పడిపోయిన జస్టిస్‌ భానుమతి

నిర్భయ కేసు విచారణ.. సొమ్మసిల్లి పడిపోయిన జస్టిస్‌ భానుమతి

నిర్భయ కేసులో శిక్ష నుంచి తప్పించుకునేందుకు.. నలుగురు దోషులు రకరకాల ప్రయత్నాలు చేస్తూనేవున్నారు. ఒకరివెంట ఒకరు పిటిషన్లు దాఖలు చేస్తూ ఉరిశిక్ష వాయిదా పడేలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ కూడా.. శిక్షను తప్పించుకోవడానికి మానసిక స్థితి బాగాలేదంటూ కొత్తనాటకానికి తెరతీశాడు.

రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటీషన్‌ని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ.. వినయ్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన మానసిక పరిస్థితి బాగా లేదని, తనకు మానవీయ కోణంలో క్షమాభిక్ష ప్రసాదించాలని పిటిషన్ దాఖలు చేశాడు. రాష్ట్రపతి తన అభ్యర్థనను తోసిపుచ్చడం సమంజసం కాదని పిటిషన్‌ లో పేర్కొన్నాడు.

అయితే, వినయ్ శర్మ పెట్టుకున్న పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రస్తుతం అతని మానసిక స్థితి బాగానేవుందని చెప్పింది. వినయ్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాడని తెలిపింది. తాజా తీర్పుతో నిర్భయ బాధిత కుటుంబానికి కాస్త ఊరట లభించినట్టయింది.

ఇదిలావుంటే, నిర్భయ దోషులకు ఉరిపై ట్రయల్ కోర్టు స్టే ఇవ్వడం.. హైకోర్టు దానిని సమర్థించడాన్ని సవాల్ చేస్తూ.. కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ ను జస్టిస్ భానుమతి విచారణకు స్వీకరించారు. అయితే, ఈ కేసులో వాదోపవాదాలు జరుగుతన్న సమయంలో.. జస్టిస్‌ భానుమతి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో భద్రతా సిబ్బంది ఆమెను కోర్టు రూం నుంచి తీసుకెళ్లి వైద్యసాయం అందించారు.

Tags

Read MoreRead Less
Next Story