పెళ్లి పనులు స్టార్ట్ .. కాబోయే భార్య ఫోటోలు ట్విట్టర్ లో పెట్టిన నితిన్

పెళ్లి పనులు స్టార్ట్ .. కాబోయే భార్య ఫోటోలు ట్విట్టర్ లో పెట్టిన నితిన్

యువ హీరో నితిన్ శాలిని అనే అమ్మాయి మనసు దోచుకుని ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. గత ఐదు సంవత్సరాలు గా ప్రేమలో ఉన్న ఇద్దరూ పెద్దల్ని ఒప్పించి సంప్రదాయబద్ధంగా కల్యాణం చేసుకోబోతున్నారు. ఇద్దరి సామాజిక వర్గాలు ఒక్కటే కావడంతో.. పెద్దలు కూడా ఎటువంటి అభ్యంతరాలు పెట్టలేదని తెలుస్తుంది. ఫిబ్రవరి14 ప్రేమికుల రోజున ఇరు కుటుంబాల పెద్దలు పసుపు కుంకాలు పెట్టుకుని సంబంధాన్ని నిశ్చయించుకున్నారు. ఏప్రియల్ 15 , 16 తారీఖుల్లో ముఖ్యమైన సన్నిహితులు, స్నేహితులు, బంధువులు మధ్య దుబాయ్ లో సంగీత్, మెహందీ ఫంక్షన్, పెళ్లి జరగనున్నట్టు తెలుస్తుంది. అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఇవ్వనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story